మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్
సోమవారం వెల్లడించిన ఐఐటీ కాన్పూర్
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ -2025 ను మే 18న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్ సోమవారం వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షలమందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నది.
మే 18న రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి పేపర్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాల వివరాల కోసం jeeadv.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించింది.