నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1.. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్ల‌ ప్రయాణం

ఆదిత్య ఎల్‌-1 సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర విస్ఫోటనాలు, సౌర తుఫానులకు కారణాలతో పాటు మూలాలు, కరోనా, కరోనల్‌ లూప్‌ ప్లాస్మా నిర్మాణంతో పాటు సాంద్రత, లక్షణాలతో పాటు పలు అంశాలపై పరిశోధనలు చేయ‌నుంది.

Advertisement
Update:2023-09-02 14:49 IST

ఆదిత్య L1నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య మిషన్‌ను ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసిన ఆదిత్య ఎల్ 1 నౌక విజయవంతంగా ప్రయాణం మొదలు పెట్టింది.

చంద్రయాన్‌-3 సక్సెస్‌తో దూకుడు మీదున్న ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్‌గా షురూ చేసింది. ఈ శాటిలైట్‌ను ఇస్రో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజియన్‌ పాయింట్‌ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది.


 ఆదిత్య ఎల్‌-1 సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర విస్ఫోటనాలు, సౌర తుఫానులకు కారణాలతో పాటు మూలాలు, కరోనా, కరోనల్‌ లూప్‌ ప్లాస్మా నిర్మాణంతో పాటు సాంద్రత, లక్షణాలతో పాటు పలు అంశాలపై పరిశోధనలు చేయ‌నుంది.


అయితే అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆగస్ట్‌ 2018లో పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను పంపింది. 2020లో నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీతో కలిసి మారుతున్న అంతరిక్ష వాతావరణంపై అన్వేషించేందుకు సోలార్‌ ఆర్బిటర్‌ను ప్రారంభించింది.



జపాన్‌కు చెందిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జక్సా) 1981లో తొలి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి మిషన్‌ను ప్రారంభించింది. హార్డ్ ఎక్స్-కిరణాలను ఉపయోగించి సోలా‌ర్‌ ఫ్లేమ్స్‌పై అధ్యయనం చేయడం దీని లక్ష్యం. ఇక యూరప్‌ 1990 అక్టోబర్‌లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సూర్యుడి ఎగువన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్‌ మిషన్‌ను మొదలు పెట్టింది. అటు చైనా కూడా 2022లో అడ్వాన్స్‌డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని ప్రారంభించింది.

ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న దేశాల సరసన భారత్ నిలువనుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టిన దేశాలకు భిన్నంగా ఇస్రో ఎల్‌-1 పాయింట్‌లో శాటిలైట్‌ను ఉంచబోతుంది.

Tags:    
Advertisement

Similar News