పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ కిందికి తెచ్చే ఆలోచనలో కేంద్రం ?
Is petrol and diesel under GST?: పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తేవాలన్న ఆలోచనకు చాలా రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే GST బకాయిలు కేంద్రం చెల్లించడం లేదని తెలంగాణ తో సహా పలు రాష్ట్రాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ లను కూడా GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందా ? ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు వింటే అదే అనుమానం కలుగుతోంది.
పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తేవాలన్న ఆలోచనకు చాలా రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే GST బకాయిలు కేంద్రం చెల్లించడం లేదని తెలంగాణ తో సహా పలు రాష్ట్రాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రకటించారు.
పరిశ్రమల ఛాంబర్ PHDCCI సభ్యులతో బడ్జెట్ అనంతర ఇంటరాక్టివ్ సెషన్‌లో సీతారామన్ మాట్లాడుతూ, రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకవస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు.
కాగా, దేశాభివృద్ది కోసం ప్రభుత్వ వ్యయం పెంచే ప్రయత్నం చేస్తున్నామని ఆమె తెలిపారు. 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చామని, తద్వారా తాము వృద్ధి వేగాన్ని కొనసాగించగలుగుతామని చెప్పారు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నదని ఆమె అన్నారు.
ఫిబ్రవరి 18న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి ప్రకటించిన మేరకు సిమెంట్‌పై రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడానికి ఫిట్‌మెంట్ కమిటీ సమావేశమవుతుంది. ప్రస్తుతం సిమెంట్‌పై 28 శాతం జిఎస్‌టి ఉంది" అని సిబిఐసి ఛైర్మన్ వివేక్ జోహ్రీ గత వారం తెలిపారు.
విద్యుత్‌తో సహా వివిధ రంగాలలో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడానికి , 'ఒక దేశం, ఒకే రేషన్ కార్డ్' పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలపై కూడా ఒత్తిడి తెస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
మరో వైపు పెట్రోల్ , డీజిల్ లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటిని GST కిందికి తీసుకవస్తే దేశవ్యాప్తంగా ఒకే రేటు అమలు చేయవచ్చని కేంద్రం ఆలోచనగా ఉంది. అయితే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తగ్గిపోవడమే కాకుండా కేంద్రం GST బకాయిలను రాష్ట్రాలకు సరిగ్గా చెల్లించడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.