ఈ క్రికెట్ దౌత్యం అదానీ కోసమేనా ?

ఆస్ట్రేలియా ప్రధాని నాలుగు రోజుల భారత దేశ పర్యటనకు వచ్చారు. ఆయనకు దేశంలో ఊహించని ఆతిథ్యం లభిస్తోంది. ఎక్కడికి పోయినా గ్రాండ్ వెల్కం లభిస్తోంది. వీదేశీ ప్రధానులు, అధ్యక్షులు ఎవ్వరొచ్చినా ఆతిథ్యం గొప్పగానే ఉంటుంది కానీ ఈ సారి ఆంథోనీ అల్బనీస్ కోసం మోడీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
Update:2023-03-10 08:04 IST

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో నిన్న‌ జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు భారత ప్రధానిమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కలిసి హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికిముందు వారిద్దరూ గోల్ఫ్ కార్ట్‌తో రూపొందించిన "రథం" లో స్టేడియమంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు చేతులు ఊపుతూ మోడీ ఉత్సాహంగా కనిపించారు.

అంతకుముందు, మోడీ ఓ ట్వీట్ చేశారు: “ భారతదేశం, ఆస్ట్రేలియాలో క్రికెట్ అంటే ప్రజలకు ప్రాణం. భారతదేశం-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు నా గొప్ప‌ స్నేహితుడు, ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి అహ్మదాబాద్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇది ఉత్తేజకరమైన గేమ్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను! ” అన్నారు మోడీ.

ఆస్ట్రేలియా ప్రధాని నాలుగు రోజుల భారత దేశ పర్యటనకు వచ్చారు. ఆయనకు దేశంలో ఊహించని ఆతిథ్యం లభిస్తోంది. ఎక్కడికి పోయినా గ్రాండ్ వెల్కం లభిస్తోంది. వీదేశీ ప్రధానులు, అధ్యక్షులు ఎవ్వరొచ్చినా ఆతిథ్యం గొప్పగానే ఉంటుంది కానీ ఈ సారి ఆంథోనీ అల్బనీస్ కోసం మోడీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య మంచి బంధం ఏర్పడితే అంతకన్నా కావాల్సింది ఏముంది.

ఇక మనం ఒక్క సారి ఆస్ట్రేలియాలో జరుగుతున్న కథను కూడా చెప్పుకోవాలి. అక్కడ గౌతమ్ అదానీ గ్రూపు బొగ్గు మైనింగ్ చేస్తోంది. ఆ మైనింగ్ కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలోని పర్యావరణ కార్యకర్తలు, ప్రజలు చాలా కాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.

అదానీ గ్రూపు అక్రమాలపై హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ఆస్ట్రేలియాలో నిరసనలు మరింత పెరిగాయి. అదానీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సమీక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో అదానీ గ్రూప్‌కు నిధులు సమకూర్చిన బ్యాంకుల ముందు ప్రజలు ఫిబ్రవరి 11న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిరసనకారులు అదానీకి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

ఈ నేపథ్యంలో నిన్న, ఈ రోజు ఇటు ఇండియాలో, అటు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాలో భారత ప్రధానిమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ల మధ్య నెలకొన్న ఆప్యాయత, ప్రేమల గురించే చర్చలు జరిగాయి.

హటాత్తుగా క్రికెట్ పై మోడీకి ఇంత ప్రేమ కలగడానికి కారణమేంటని నెటిజనులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. గౌతమ్ అదానీ కోసం మోడీ బ్యాటింగ్ చేస్తున్నారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

ఈ నేపథ్యంలో అల్బనీస్‌తో మోడీప్రేమ , ఆప్యాయతలు అదానీకి సాయం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంగా పలువురు నెటిజనులు అభివర్ణించారు.

“అదానీ వివాదంతో ఇండో-ఆస్ట్రేలియన్ సంబంధాలు ఇంత స్థాయికి దిగజారిపోయాయా? మోడీ ప్రభుత్వం అదానీ కోసం క్రీడా దౌత్యాన్ని ఉపయోగించవలసి వచ్చిందా? మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, ఏబీ వాజ్‌పేయి లు గతంలో మన‌ క్రికెట్ అభిరుచిని శాంతి కోసం ఉపయోగించుకున్నారు’’ అని కాలమిస్ట్ సీమా సేన్‌గుప్తా ట్వీట్ చేశారు.

ఇంతకూ....

మన ప్రధానీ మోడీకి ప్రేమ క్రికెట్ మీదనా ?

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మీదనా ?

గౌతమ్ అదానీ మీదనా ?

Tags:    
Advertisement

Similar News