భారత్ సాధువుల దేశం.. శాంటాక్లాజుల దేశం కాదు.. వీహెచ్ పీ

హిందూ మతానికి చెందిన విద్యార్థులను క్రిస్మస్ ట్రీలు తీసుకొని పాఠశాలకు రావాల్సిందిగా కొన్ని పాఠశాలలు బలవంతం చేస్తున్నాయని వీహెచ్ పీ నాయకులు ఆరోపించారు. భారతదేశం సాధువుల దేశం అని శాంటాక్లాజుల దేశం కాదనివారు పేర్కొన్నారు. హిందువుల పిల్లలు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మహావీర్, గురు గోవింద్ సింగ్ లాగా గొప్ప వ్యక్తుల్లాగా మారాలని శాంటాక్లాజుల మారొద్దని అన్నారు.

Advertisement
Update:2022-12-24 20:32 IST

దేశవ్యాప్తంగా హిందూ పిల్లలపై క్రైస్తవ మతాన్ని రుద్దే కుట్ర జరుగుతోందని వీహెచ్ పీ ఆరోపణలు చేసింది. ఆదివారం క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. కొన్ని పాఠశాలలు పిల్లలతో క్రిస్మస్ ట్రీ లు తెప్పించడమే కాకుండా, శాంటాక్లాజ్ దుస్తులు ధరింపచేసి వేడుకలు జరిపాయి. పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు జరపడంపై వీహెచ్ పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యా సంస్థలు తమ వద్ద చదువుకుంటున్న విద్యార్థులు ఎవరూ శాంటాక్లాజ్ దుస్తులు ధరించి వచ్చేందుకు అనుమతి ఇవ్వొద్దంటూ వీహెచ్ పీ సూచించింది.ఈ మేరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని పాఠశాలలకు ఒక హెచ్చరిక చేసింది. పిల్లలు శాంటాక్లాజ్ వేషధారణ వేయకుండా చూడాలని భోపాల్ నగరంలోని అన్ని విద్యాసంస్థలకు వీహెచ్ పీ లేఖలు రాసింది.

హిందూ మతానికి చెందిన విద్యార్థులను క్రిస్మస్ ట్రీలు తీసుకొని పాఠశాలకు రావాల్సిందిగా కొన్ని పాఠశాలలు బలవంతం చేస్తున్నాయని వీహెచ్ పీ నాయకులు ఆరోపించారు. భారతదేశం సాధువుల దేశం అని శాంటాక్లాజుల దేశం కాదనివారు పేర్కొన్నారు. హిందువుల పిల్లలు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మహావీర్, గురు గోవింద్ సింగ్ లాగా గొప్ప వ్యక్తుల్లాగా మారాలని శాంటాక్లాజుల మారొద్దని అన్నారు.

వీహెచ్ పీ రాసిన లేఖలతో భోపాల్ నగరంలోని కొన్ని విద్యా సంస్థలు క్రిస్మస్ వేడుకలకు దూరం కాగా, మరి కొన్ని పాఠశాలలో మాత్రం యధావిధిగా వేడుకలు జరిపారు. ఏది ఏమైనా పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు జరపవద్దని పాఠశాలలకు వీహెచ్ పీ నాయకులు లేఖలు రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మామూలుగా పాఠశాలల్లో మతాలకు అతీతంగా ఏ పండుగలు వచ్చినా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు జరపడం హిందూ పిల్లలను క్రిస్టియన్ మతంలోకి ప్రేరేపించే కుట్రగా వీహెచ్ పీ నాయకులు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News