ఇండిపెండెన్స్ డే స్పెషల్! ఇండియా గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలుసా?

ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Update:2024-08-14 16:30 IST

ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియానే. అలాగే భారతదేశపు రాజ్యాంగం కూడా ప్రపంచంలోనే అతి పెద్దది. ఇందులో 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉంటాయి.

ప్రపంచంలో ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడే రెండో దేశం మనదే. మనదేశంలో సుమారు 12 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడతారు.

వరల్డ్‌లో లార్జెస్ట్ వెజిటేరియన్ కంట్రీ కూడా ఇండియానే. మనదేశంలో సుమారు 40 శాతం మంది నాన్‌వెజ్ తినరు.

ప్రపంచంలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న స్పేస్ ఏజెన్సీల్లో ఇస్రో కూడా ఒకటి. మార్స్, మూన్, వీనస్.. ఇలా పలు గ్రహాలు, ఉపగ్రహాలపై ఇస్రో ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోంది. అంతేకాదు ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటుపై కూడా ఇస్రో కసరత్తులు మొదలుపెట్టింది. 1981లో రాకెట్స్ పరికరాలు సైకిల్ మీద తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇతర దేశాల శాటిలైట్స్‌ను స్పేస్ లోకి మోసుకెళ్లే వరకూ ఇస్రో ఎదిగింది.

ప్రపంచానికి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేస్తున్న దేశం కూడా ఇండియానే. ఇండియన్ కంపెనీలు సుమారు 90 దేశాలకు తమ సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఎగుమతి చేస్తున్నాయి. అంతేకాదు, అమెరికా, జపాన్ తర్వాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన దేశం కూడా మనదే.

ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వాడే దేశం ఇండియానే. ఇండియాలోని ఆడవాళ్లు సుమారు ఇరవై టన్నుల బంగారాన్ని ధరించి ఉన్నారని ఒక అంచనా. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం బంగారం మన ఆడవాళ్ల దగ్గరే ఉంది.

ప్రపంచంలో తక్కువ డైవోర్స్ రేట్ ఉన్న దేశం మనదే. ఇండియాలో 85 శాతం మంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అందులో కేవలం వందలో ఒక్కరు మాత్రమే డివోర్స్ తీసుకుంటున్నారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి.

ఇండియాకు ‘ల్యాండ్ ఆఫ్ స్పైసెస్’ అని పేరు కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో 70 శాతం సుగంధ ద్రవ్యాల ఎక్స్‌పోర్ట్ ఇండియా నుంచే జరుగుతుంది.

ప్రపంచంలో ఎక్కువ భాషలు ఉన్న దేశం, ఎక్కువ పోస్టాఫీసులు ఉన్న దేశం మనదే. అలాగే అమెరికా, రష్యా, చైనా తర్వాత అతి పెద్ద సైనిక శక్తి కూడా ఇండియాదే. అమెరికా, యూకే తర్వాత ఎక్కవ గిన్నిస్ రికార్డులు ఉన్న దేశం కూడా ఇండియానే.

ప్రపంచంలో ఎక్కువ సినిమాలు తీసే దేశం కూడా మనదే. హాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ రెండు రెట్లు పెద్దది.

Tags:    
Advertisement

Similar News