కోల్పోయిన ఇతని 22 ఏళ్ళ జీవితాన్ని వెనక్కి తేగలరా ?

ప్రసాద్ 22 ఏళ్ళ తర్వాత తన స్వగ్రామం వచ్చాడు. అతడేమీ ఊరు విడిచి పారిపోలేదు. కుటుంబం మీద కోపంతో వెళ్ళిపోలేదు. ఆ గ్రామంలోనే అత్యంత పేద కుటుంబమైన తన కుటుంబాన్ని పోషించడానికి 2000 సంవత్సరంలో పని వెతుక్కుంటూ జమ్మూ వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఉన్నాడో, చనిపోయాడో అసలు ఏం జరిగిందో ఆయన కుటుంబానికి తెలియదు.

Advertisement
Update:2022-11-25 13:43 IST

47 ఏళ్ల జై ప్రకాష్ ఈ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తన గ్రామమైన కమల్‌పూర్‌కు వచ్చినప్పుడు, అతను చాలా మందిని గుర్తుపట్టలేకపోయాడు. తన మాతృభాష భోజ్‌పురిని కూడా మాట్లాడలేకపోయాడు. అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతని ప్రపంచమే తలకిందులైంది. అతని తండ్రి పక్షవాతానికి గురయ్యాడు, తల్లి, సోదరుడు,సోదరి అందరూ మరణించారు.

ప్రసాద్ 22 ఏళ్ళ తర్వాత తన స్వగ్రామం వచ్చాడు. అతడేమీ ఊరు విడిచి పారిపోలేదు. కుటుంబం మీద కోపంతో వెళ్ళిపోలేదు. ఆ గ్రామంలోనే అత్యంత పేద కుటుంబమైన తన కుటుంబాన్ని పోషించడానికి 2000 సంవత్సరంలో పని వెతుక్కుంటూ జమ్మూ వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఉన్నాడో, చనిపోయాడో, అసలు ఏం జరిగిందో ఆయన కుటుంబానికి తెలియదు.

అక్టోబర్ 2000లో జమ్మూలో రైల్వే పోలీసులు ప్రకాష్ ను లైసెన్సు లేకుండా మందుగుండు సామాగ్రిని కలిగి ఉన్నాడ‌నే ఆరోపణలపై అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో అతని నుండి 34 AK-47 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.అప్పటి ను‍ంచి 22 ఏళ్ళపాటు ప్రకాష్ జైల్లో ఉన్నాడు. ట్రయల్ లేదు, బెయిల్ లేదు. ఒక వేళ అతని మీద ఆరోపించబడిన కేసు నిరూపించబడినప్పటికీ దానికి శిక్ష 3 ఏళ్ళు మాత్రమే.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతని పేరు కూడా పోలీసులకు తెలియదు. అతనిపై ఆరోపించిన కేసును "స్టేట్ vs వ్యక్తి ' అని పోలీసులు ఫైల్ చేశారు. అతనికి మతి స్థిమితం లేదని పోలీసులు చెప్పారు. డాక్టర్ కూడా అదే తేల్చాడు.

2014లో అంఫల్లా జిల్లా జైలు సూపరింటెండెంట్ (ఎస్పీ) జైల్లో ఉన్నవాళ్ళకు ఆధార్ కార్డుల తయారీ ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో, ప్రకాష్ తన సరైన పేరు, అలాగే అతని తండ్రి పేరు అతని గ్రామం, తహసీల్, పోస్టాఫీస్ , జిల్లా వివరాలను స్పష్టంగా పేర్కొన్నాడు. అదే కార్డును ఆధార్ శాఖ అతను ఇచ్చిన పోస్టల్ చిరునామాకు పంపింది. కానీ ప్రకాష్ జైల్లో ఉన్నాడన్న విషయాన్ని పోలీసులు కానీ జైలు అధికారులు కానీ కుటుంబానికి మాత్రం తెలియజేయలేదు.

చివరకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా, న్యాయ సహాయం లేకుండా ఏళ్ల తరబడి జైలులో మగ్గుతున్న వారిని త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా విడుదలయ్యేవారి లిస్టులో ప్రకాష్ పేరు కూడా ఉంది.

ప్రకాష్ కజిన్ ప్రసాద్ కు అతను జమ్ము అంబాలా జైల్లో ఉన్న విషయం తెలిసి అతి కష్టం మీద అక్కడికి వెళ్ళాడు. అతన్ని చూసిన ప్రకాష్ చాలా ఉత్సాహంగా నా సోదరుడు వచ్చాడు అని పంజాబీ భాషలో అరుచుకుంటూటు వచ్చి కౌగలించుకున్నాడు. ప్రసాద్ కు పంజాబీ రాదు...ప్రకాష్ భోజ్ పురీ మర్చిపోయాడు...

మరో వైపు ప్రకాష్ పై నేరారోపణలు రద్దు చేయాలని, పోలీసులు, జైలు అధికారులపై శాఖాపరమైన విచారణను ప్రారంభించాలని కోరుతూ ప్రకాష్ తరపున ఇర్ఫాన్ ఖాన్ అనే అడ్వకేట్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించాల్సిందిగా హైకోర్టు రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. విచారణ జనవరి 31, 2023కి షెడ్యూల్ చేయబడింది.

చివరకు ప్రకాష్ ఆజాదీకా అమృత్ ఉత్సవ్ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు విడుదలయ్యాడు. అతని కజిన్ ప్రసాద్ అతన్ని స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఆ గ్రామ ప్రజలు అతనికి కొత్త బట్టలు ఇచ్చి, పూలమాలలతో స్వాగతం పలికారు. అయితే భాష మర్చిపోయి, బతుకు కోల్పోయి, తన వాళ్ళందరినీ కోల్పోయి, 22 ఏళ్ళ జీవితాన్నే కోల్పోయిన ప్రసాద్ కు వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలదా ?

Tags:    
Advertisement

Similar News