పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఇస్తే అన్ని విమర్శలకు జవాబిస్తా... రాహుల్ గాంధీ

“ప్రభుత్వానికి చెందిన నలుగురు మంత్రులు సభలో నాపై ఆరోపణలు చేశారు. వారికి జవాబు చెప్పే బాధ్యత, సభలో మాట్లాడే హక్కు నాకు ఉంది’’ అని రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో అన్నారు.

Advertisement
Update:2023-03-16 17:12 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై, పార్లమెంట్‌లో అధికార పార్టీ ఎంపీలు తనపై చేసిన ఆరోపణలపై మాట్లాడేందుకు తనకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.

“ప్రభుత్వానికి చెందిన నలుగురు మంత్రులు సభలో నాపై ఆరోపణలు చేశారు. వారికి జవాబు చెప్పే బాధ్యత, సభలో మాట్లాడే హక్కు నాకు ఉంది’’ అని రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో అన్నారు. తన మాటలను మంత్రులు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు జవాబిచ్చే అవకాశం ఇవ్వకుండా తనపై ఆరోపణలు మాత్రం చేయడం ఏం ప్రజాస్వామ్యం అని రాహుల్ ప్రశ్నించారు.

.

గత మూడు రోజులుగా పార్లమెంట్‌లో తన మైక్రోఫోన్ మ్యూట్ చేశార‌ని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు..

స్పీకర్ కు రాసిన లేఖలో చౌదరి,

“మార్చి 13, 2023న సభ విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటి నుండి, సభలో ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నట్టు నాకు కనిపిస్తోంది, ”అని అన్నారు.గత మూడురోజులుగా రాహుల్ గాంధీ సహా మా పార్టీ సభ్యుల మైక్ లను మ్యూట్ చేశారు.

అని చౌదరి ఆరోపించారు.

కాగా, UK హౌస్ ఆఫ్ కామన్స్ ఈవెంట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “పార్లమెంటులో మాట్లాడటానికి మాకు మైక్‌లు ఇవ్వరు. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే వాటిని మ్యూట్ చేస్తారు.'' అని అన్నారు.

అంతకు ముందు, భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శించడం ద్వారా భారతదేశాన్ని కించపరిచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు

Tags:    
Advertisement

Similar News