నేను భారతీయ ముస్లింని, చైనా ముస్లింను కాదు: ఫరూక్ అబ్దుల్లా

జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా బీజేపీ పై విరుచుకపడ్డారు. దేశంలో ముస్లింల పట్ల ఆ పార్టీ ద్వేష భావాన్ని నింపుతోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. నేను ముస్లింని, కానీ భారతీయ ముస్లింని. చైనా ముస్లిను కాదు.అని అబ్దుల్లా అన్నారు.

Advertisement
Update:2022-10-14 16:23 IST

దేశంలో మ‌త తత్వాన్ని రెచ్చ‌గొడుతూ స‌మాజంలో ప్ర‌జ‌ల మ‌ధ్య సామ‌ర‌స్యాన్నిబిజెపి దెబ్బ‌తీస్తోంద‌ని జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా మండిప‌డ్డారు. ముస్లింల ప‌ట్ల వివ‌క్ష చూపుతూ వారిపై ప్ర‌జ‌ల్లో ద్వేష భావాన్ని నింపుతోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

తన దేశంలోని ముస్లింలను తప్పుగా చూపడంపై ఫ‌రూక్ అబ్దుల్లా కేంద్రంపై విరుచుకుపడ్డారు." మేము మీతో ఉన్నాము. మ‌న‌మంతా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా ఉంచాలి. నేను ముస్లింని, కానీ భారతీయ ముస్లింని. నేను చైనా ముస్లిను కాదు." అని అబ్దుల్లా అన్నారు.

"ప్రతిఒక్కరూ భిన్నంగా ఉన్నా కానీ కలిసి మనం స‌మైక్య‌దేశాన్ని నిర్మించగలము. మతాలు ఒకరినొకరు ద్వేషించమని ప్రజలకు బోధించవు.. హిందుసాన్ అందరికీ చెందినది." అని అన్నారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీల నాయ‌కుల‌పై బిజెపి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఆయ‌న ఖండించారు. ప్ర‌జాస్వామ్య‌, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూన్నార‌ని విమ‌ర్శించారు.

ఎన్సీపీ నేత ఛ‌గ‌న్ భుజ‌బ‌ల్ 75వ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ ఫ‌రూఖ్ అబ్దుల్లా తో పాటు, సినీ పాట్ల రచయిత, కవి, జావేద్ అఖ్త‌ర్, ఎన్సీపీ ఛీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే, అజిత్ ప‌వార్ త‌దిత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

భిన్న భావజాలాలను ఆమోదించ‌డ‌మే భారతదేశం గొప్ప‌ద‌నం : జావేద్ అఖ్త‌ర్

మతతత్వ శక్తులు పెచ్చ‌రిల్లుతున్న‌ప్పుడు ఆ శక్తులను వ్యతిరేకించాల‌ని, వాటికి వ్య‌తిరేకంగా పోరాడాల‌ని చెప్ప‌డం ప్రతి పౌరుడి కర్తవ్యమని ప్ర‌ముఖ ర‌చ‌య‌త జావేద్ అఖ్త‌ర్ అన్నారు. తాను రాజ‌కీయ నాయ‌కుడిని కాద‌ని, అయితే మ‌త‌త‌త్వ శ‌క్తులు విజృంభిస్తున్న‌పుడు వాటిపై ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గ‌ళాల‌ను వినిపిస్తూ పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

"భారతదేశం యొక్క మూలాలు చాలా బలంగా ఉన్నాయి, వాటిని నిర్మూలించాలనుకునే వారు ఎప్పుడూ దానిని ఏమీ చేయలేక‌పోయారు. మనం ఎప్పుడూ ఇతరుల మాటలను వినడం వల్లే ఇక్కడ ప్రజాస్వామ్యం మనుగడలో ఉంది. మేము ఒకరిని దేశవిరోధి అని ఎప్పుడూ చెప్పలేదు. భిన్నమైన సిద్ధాంతాలను అంగీకరించడమే భారతదేశం ఔన్న‌త్యం" అని ఆయన పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News