డిజిటల్ లావాదేవీల్లో హైదరాబాద్ కు రెండవ స్థానం
వినియోగదారులు తరచుగా సందర్శించే కిరాణా దుకాణాలు, రెస్టారెంట్‌లు, దుస్తులు , ఫార్మసీ, మెడికల్, హోటళ్లు, జ్యువెలరీ రిటైల్, గృహోపకరణాలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు వంటివే కాకుండా ఈ-కామర్స్ (వస్తువులు, సేవల కోసం షాపింగ్), గేమింగ్, యుటిలిటీ, ఆర్థిక సేవలు కలిపి వాల్యూమ్ పరంగా 86 శాతానికి పైగా ఉన్నాయి.
ఆధునిక టెక్నాలజీ ఏది వచ్చినా హైదరాబాద్ దాన్ని వడిసిపట్టుకుంటుంది. అన్ని రంగాల్లో టెక్నాలజీ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ ముందు భాగాన ఉండగా ఇప్పుడు డిజిటల్ లావాదేవీల్లో కూడా హైదరాబాద్ ముందుంది. దేశంలోనే రెండవ స్థానం సాధించింది.
ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ వరకు .హైదరాబాద్ లో 1 కోటి 4 లక్షల డిజిటల్ లావాదేవీలు జరగగా వాటి విలువ 3వేల 50 కోట్లుగా ఉంది. ఈ రంగంలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
వరల్డ్‌లైన్ ఇండియా నివేదిక ప్రకారం, పండుగ సీజన్ అమ్మకాలు, వినియోగం పెరగడం డిజిటల్ చెల్లింపుల లావాదేవీలలో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచేందుకు దోహదపడింది. మొదటి ఐదు నగరాల్లో డిజిటల్ లావాదేవీల పరిమాణం - బెంగళూరు ₹1.48 కోట్లు , హైదరాబాద్ ₹1.4 కోట్లు, చెన్నై- ₹97 లక్షలు , ముంబై- ₹92లక్షలు, పూణే ₹78లక్షలు. ఇక ఆ లావాదేవీల విలువ బెంగళూరులో 3,620 కోట్ల రూపాయలు కాగా, హైదరాబాద్ 3,050కోట్ల రూపాయలు, చెన్నై 2,250 కోట్ల రూపాయలు, ముంబై 2,740 కోట్లు, పూణే 1,730 కోట్ల రూపాయలు.
"నేడు, కస్టమర్లు, విక్రేతలు ఇద్దరూ డిజిటల్ చెల్లింపుల పట్ల మరింత ఆసక్తిగా ఉన్నారు. ప్రతి త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. "అని వరల్డ్‌లైన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ నరసింహన్ అన్నారు.