అదానీకి మనం ఏమవుతాము ? మోడీకి మూడు ప్రశ్నలు

కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్‌లో ... “అదానీ మహామెగా స్కామ్‌పై ప్రధానమంత్రి మౌనం వహించడం వల్ల HAHK-హమ్ అదానికే హై కౌన్ అనే సిరీస్‌ను ప్రారంభించాల్సి వచ్చింది. మేము ఈరోజు నుండి ప్రతిరోజూ 3 ప్రశ్నలను ప్రధానమంత్రికి సంధిస్తాము.'' అని రాశారు

Advertisement
Update:2023-02-06 07:09 IST

అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ తన కొత్త సిరీస్ హమ్ అదానీ కే హై కౌన్ (HAHK) (అదానీకి మనం ఏమవుతాము?). లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిరోజూ మూడు ప్రశ్నలను సంధిస్తామని ప్రకటించింది.

కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్‌లో ... “అదానీ మహామెగా స్కామ్‌పై ప్రధానమంత్రి మౌనం వహించడం వల్ల HAHK-హమ్ అదానికే హై కౌన్ అనే సిరీస్‌ను ప్రారంభించాల్సి వచ్చింది. మేము ఈరోజు నుండి ప్రతిరోజూ 3 ప్రశ్నలను ప్రధానమంత్రికి సంధిస్తాము.'' అని రాశారు

జైరాం రమేష్ మొదటి మూడు ప్రశ్నలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మొదటి ప్రశ్నలో , పనామా పేపర్స్, పండోర పేపర్లలో షెల్ కంపెనీలను నిర్వహిస్తున్న గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పై విరుచుకపడ్డారు.

"వినోద్ అదానీ అనేక షెల్ కంపెనీల‌ ద్వారా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ లు చేశారని ఆరోపణలున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడంలో మీ చిత్తశుద్ధి గురించి మీరు తరచుగా మాట్లాడుతున్నారు. "మీకు బాగా తెలిసిన వ్యాపార సంస్థ అయిన అదానీ గ్రూపు వేగవంతమైన అభివృద్ది వెనక వాస్తవాలు ఏమిటి? తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న అదానీ గ్రూపు పై నిజాయితీ గల మీ చర్యల గురించి మాకు చెప్పండి?"

"రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి, మీ ఆశ్రితుల ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా లేని వ్యాపార సంస్థలను శిక్షించడానికిసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లను మీరు దుర్వినియోగం చేసారు" అని రమేష్ తదుపరి ప్రశ్నలో ఆరోపించారు.

“అదానీ గ్రూప్‌పై సంవత్సరాల తరబడి వస్తున్న‌ తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా?” అని ఆయన ప్రశ్నించారు.

HAHK కింద ఉన్న మూడవ ప్రశ్న ఏమిటంటే: “విమానాశ్రయాలు, ఓడరేవులలో గుత్తాధిపత్యాన్ని సాధించడానికి ప్రభుత్వమే అనుమతించిన‌ అదానీ గ్రూపు ఇంత కాలం మీ పరిశీలన నుండి తప్పించుకోవడం ఎలా సాధ్యమయ్యింది?”

కాగా, అదానీ గ్రూపుపై కాంగ్రెస్ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించింది. అదానీపై వచ్చిన అవకతవక ఆరోపణలపై పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్‌తో సహా వివిధ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News