ఘోర రోడ్డు ప్రమాదం.. - బ‌స్సులో 25 మంది సజీవ దహనం

మంట‌ల ధాటికి బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 25 మంది బ‌స్సులోనే స‌జీవ ద‌హ‌నం కాగా, 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన‌వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

Advertisement
Update:2023-07-01 08:09 IST

మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. 32 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగ‌డంతో 25 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి 1.45 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యావ‌త్మాల్ నుంచి పూణే వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బుల్దానాలోని సమృద్ధి (ఎక్స్‌ప్రెస్ హైవే) మహామార్గంపై వెళ్తుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

బ‌స్సు ఈ రోడ్డులో ప్ర‌యాణిస్తుండ‌గా టైరు పేలి డివైడ‌ర్‌ను ఢీకొన్న‌ట్టు తెలిసింది. దీంతో ఒక్క‌సారిగా బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌యాణికులంతా గాఢ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం, వెంట‌నే మంట‌లు చెల‌రేగడంతో ప్ర‌యాణికులు త‌ప్పించుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా పోయిందని స‌మాచారం.

మంట‌ల ధాటికి బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 25 మంది బ‌స్సులోనే స‌జీవ ద‌హ‌నం కాగా, 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన‌వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌వారిని బుల్దానా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News