లాకప్ మరణాలలో దేశంలో గుజరాత్ దే మొదటి స్థానం

గుజరాత్‌లో 2017-18 మధ్య 14, 2018-19లో 13, 2019-20లో 12 కస్టడీ మరణాలు సంభవించాయి. 2021-22 మధ్య కేసుల సంఖ్య 24కి పెరిగిందని ఎన్‌హెచ్‌ఆర్సి నివేదిక తెలిపింది.

Advertisement
Update:2023-03-16 13:39 IST

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) నివేదిక ప్రకారం లాకప్ మరణాలలో దేశంలో గుజరాత్ దే మొదటి స్థానం . ఆ రాష్ట్రంలో గత ఐదేళ్లలో 80 లాకప్ మరణాలు నమోదయ్యాయి

గుజరాత్‌లో 2017-18 మధ్య 14, 2018-19లో 13, 2019-20లో 12 కస్టడీ మరణాలు సంభవించాయి. 2021-22 మధ్య కేసుల సంఖ్య 24కి పెరిగిందని ఎన్‌హెచ్‌ఆర్సి నివేదిక తెలిపింది.

ఈ నివేదికను హోం శాఖ రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హిరేన్ బ్యాంకర్ మాట్లాడుతూ, “ గుజరాత్‌లో పెరుగుతున్న కస్టడీ మరణాల సంఖ్య రాష్ట్రానికి సిగ్గుచేటు. చట్ట పాలన పౌర సమాజాన్ని నియంత్రించాలి. అయితే, బిజెపి ప్రభుత్వం నిర్బంధాన్ని ఉపయోగించడం అధికార దుర్వినియోగం చేయడం అన్యాయం.'' అన్నారు.

గుజరాత్ లోని జైళ్ళ పరిస్థితి కూడా అద్వాన్నంగా ఉందని హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా తెలియజేస్తుంది. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం. “గుజరాత్ రాష్ట్రంలోని జైళ్ళలో 13,999 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా, 16,597 మంది ఖైదీలు ఉన్నారు. ముఖ్యంగా, గుజరాత్ జైళ్లలో సామర్ద్యంకన్నా 2,598 మంది ఖైదీలు ఎక్కువగా ఉన్నారు ” హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించింది.

పోలీసు కస్టడీలో మరణాల సంఖ్య దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో దాదాపు 60% ,గత రెండేళ్లలో 75% పెరిగిందని హోం మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. మహారాష్ట్రలో 10 రెట్లు, కేరళ, బీహార్‌లలో మూడు రెట్లు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో రెండు రెట్లు అధికంగా కేసులు నమోదయ్యాయని డేటా వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News