కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా భేటీ....జాతీయ రాజకీయాలపై చర్చ

గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో కేసీఆర్ ఈ రోజుసమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిరువురూ జాతీయ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2022-09-16 17:00 IST

భారతీయ జనతా పార్టీ పై పోరుబాటపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీని కేంద్రం నుంచి గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకోసం జాతీయ స్థాయిలో అనేక మంది నాయకులతో సమావేశమవుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేతలు, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ , ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ ఛీఫ్ కుమార స్వామి తదితరులతో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. అంతే కాక దేశ వ్యాప్తంగా ఉన్న రైతు నాయకులను హైదరాబాద్ కు రప్పించి వాళ్ళతో రెండు రోజులపాటు సమావేశం నిర్వహించారు.

ఇదే క్రమంలో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో ఈ రోజుసమావేశమయ్యారు కేసీఆర్. హైదరాబాద్ కు వచ్చిన వాఘేలా ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిరువురూ జాతీయ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News