రాష్ట్రపతికి ఘన స్వాగతం
హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Advertisement
శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హైదరాబాద్ లో ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు మంగళవారం సాయంత్రం హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట్‌కు చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు.
Advertisement