గవర్నర్ పదవి రాజకీయ పదవి కాదు : వెంకయ్యనాయుడు
గవర్నర్లు రాష్ట్రాలకు 'మార్గదర్శిగా' వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గవర్నర్ పదవి "అలంకారప్రాయం గానీ, లేదా రాజకీయ పదవి కానీ కాదు" అని ఆయన అన్నారు.
గవర్నర్లు రాష్ట్రాలకు 'మార్గదర్శిగా' వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గవర్నర్ పదవి "అలంకారప్రాయం గానీ, లేదా రాజకీయ పదవి కానీ కాదు" అని ఆయన అన్నారు.
ప్రభుత్వం అందించే కార్యక్రమాలను రాష్ట్రాలు సక్రమంగా అమలు చేసేలా చూడాలని గవర్నర్‌లకు విజ్ఞప్తి చేశారు. వారి ప్రవర్తన రాష్ట్ర పరిపాలనకు 'ఆదర్శంగా' నిలవాలని ఆయన అన్నారు.
తన పదవీకాలం ముగియనున్న నేపధ్యంలో వెంకయ్యనాయుడు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అడ్మినిస్ట్రేటర్ల కు తన అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ఛాన్సలర్ పాత్రలో గవర్నర్లు తమ రాష్ట్రంలోని "వీలైనన్ని ఎక్కువ విశ్వవిద్యాలయాలను" తరచుగా సందర్శిస్తూ విద్యార్థులు, సిబ్బందిని ప్రోత్సహించాలన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమలును "మనసావాచా " వారు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
రాష్ట్రాలు, యుటిలలో క్షయవ్యాధి నిర్మూలన, ఇతర ఆరోగ్య అవగాహన కార్యక్రమాలలో గవర్నర్లు కూడా ముఖ్యమైన భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. టీకాలపై అవగాహన కలిగించి ప్రోత్సహించడం వల్లనే సానుకూల పలితాలు వచ్చిన విషయాన్ని ఆయన ఉదహరించారు. వివిధ టీకా ప్రచారాల్లో గవర్నర్లు భాగస్వాములు కావాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని ఆయన సూచించారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, హోంమంత్రి అమిత్ షా, సీనియర్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు.