తమిళనాడులో దారుణం.. ఐదుగురు బాలికలపై గ్యాంగ్ రేప్.. నిందితులంతా మైనర్లే

విల్లుపురం జిల్లా జానకీపురం సమీప ప్రాంతంలో నివసించే ఓ బాలిక ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లే ఆ చిన్నారి కొద్ది రోజులపాటు అనారోగ్యంతో బాధపడింది.

Advertisement
Update:2023-05-03 12:45 IST

సినిమాల ప్రభావమో లేదా సోషల్ మీడియా ప్రభావమో తెలియదు కానీ, ఇటీవల కాలంలో అత్యాచార కేసుల్లో మైనర్లే ఎక్కువగా నిందితులుగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అశ్లీల కంటెంట్ చూడటం అధికమైంది. మైనర్లు కూడా ఇటువంటి కంటెంట్ చూసి తప్పుదోవ పడుతున్నారు. తమిళనాడులో ఇప్పుడు ఐదుగురు బాలికలపై సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. నిందితులంతా 14 నుంచి 17 ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.

విల్లుపురం జిల్లా జానకీపురం సమీప ప్రాంతంలో నివసించే ఓ బాలిక ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లే ఆ చిన్నారి కొద్ది రోజులపాటు అనారోగ్యంతో బాధపడింది. తిరిగి ఆ చిన్నారి పాఠశాలకు వచ్చిన తర్వాత ఏం జరిగింది..? అని టీచర్ ఆరా తీసింది.. దీంతో ఆమెకు దిగ్భ్రాంతి గొలిపే విషయం తెలిసింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకొంది.

వెంటనే టీచర్ విషయాన్ని జిల్లా బాలల భద్రత అధికారికి తెలియజేసింది. సదరు అధికారి పాఠశాల వద్దకు చేరుకొని లైంగిక దాడికి గురైన బాలికను ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేయించారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాలిక నివసించే ప్రాంతానికి చెందిన 14-17 ఏళ్ల మధ్య వయసు ఉన్న నలుగురు బాలురు బాలికపై లైంగిక దాడి జరిపినట్లు నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు బాలురు ఈ ఒక్క చిన్నారిపైనే కాకుండా మరో నలుగురు బాలికలపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి మంగళవారం నిందితులను అరెస్టు చేశారు. పాఠశాల విద్య అభ్యసించే బాలురు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News