ఐటీ, ఈడీ బలప్రయోగంతో వాక్ స్వాతంత్య్రానికి ముప్పు: జస్టిస్‌ నారిమన్‌

''ఈడీ కేసుల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 0.2 శాతం ఉంటుంది. కానీ ఈ కేసుల్లో బెయిల్ రాదు. ఈడీ, ఐటీ శాఖల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న బలప్రయోగం భారతదేశంలో వాక్ స్వాతంత్య్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.'' అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ అన్నారు.

Advertisement
Update:2023-03-04 08:40 IST

ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడం దురదృష్టకరమైన చర్య అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ అన్నారు. ఆ చర్య అత్యంత వ్యర్థమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని, నిషేధం తర్వాత ప్రభుత్వం BBC కార్యాలయాలపై నిర్వ‌హించిన ఆదాయపు పన్ను దాడుల వంటి బలవంతపు చర్యలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో అలాంటి నిషేధాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ నారిమన్ ప్రభుత్వం కనుక‌ అలా చేయకపోతే మన దేశం పేరుకు మాత్రమే సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్ గా మిగిలిపోతుంది అన్నారాయన‌

‘వాక్స్వాతంత్య్రం: సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ''బీబీసీ డాక్యుమెంటరీ పై విధించిన నిషేధం నిష్ఫలమైంది.. ఇంటర్‌నెట్‌కు వేయి తలలు ఉంటాయి.. ఇలాంటి డాక్యుమెంటరీలను యూట్యూబ్‌ నుంచో ఇంకో వెబ్‌సైట్‌ నుంచో తొలగించినా, అవి ఎక్కడో ఓ చోట బైటికి వస్తాయి దేన్నైనా నిషేధించడం అంటే.. దాన్ని మరింత ఎక్కువ మంది చూసేలా చేయడమే'' అని అన్నారు.

ఈడీ కేసుల గురించి నారిమన్ మాట్లాడుతూ, ''ఈడీ కేసుల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 0.2 శాతం ఉంటుంది. కానీ ఈ కేసుల్లో బెయిల్ రాదు. ఈడీ, ఐటీ శాఖల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న బలప్రయోగం భారతదేశంలో వాక్ స్వాతంత్య్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.'' అన్నారాయన‌

''భారత దేశంలో ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం లేదు, ప్రశ్నించే మీడియా లేదు. ఇది ఇప్పుడు భారత దేశం ముందున్న‌ పెద్ద సమస్య'' అని నారిమన్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News