ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

చిన్న తుంగలీ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం గాలింపు చేస్తుండగా మావోయిస్టులు కనిపించారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు వారిపై వెంటనే కాల్పులకు దిగగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిపై ఎదురు కాల్పులు చేపట్టారు.

Advertisement
Update:2024-02-27 17:11 IST

ఛత్తీస్‌గఢ్‌లో అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్‌ జిల్లా జంగ్లా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

చిన్న తుంగలీ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం గాలింపు చేస్తుండగా మావోయిస్టులు కనిపించారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు వారిపై వెంటనే కాల్పులకు దిగగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిపై ఎదురు కాల్పులు చేపట్టారు. ఈ క్రమంలో నలుగురు మావోయిస్టులులు ప్రాణాలు కోల్పోయారు.

కాల్పులు జరిగిన అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టగా, నలుగురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. అదే ప్రాంతంలో కొన్ని ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

Tags:    
Advertisement

Similar News