రాహుల్ గాంధీతో కలిసి నడిచిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్
బుధవారంనాడు రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుండి కాంగ్రెస్ పాదయాత్ర పునఃప్రారంభమైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఉదయం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. వీరిరువురూ నడుస్తూనే సీరియస్ గా చర్చలు జరుపుతున్న వీడియో,ఫొటోలను కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రజలు, పలు రంగాలకు చెందిన మేధావుల చేరికతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. శాంతి సౌభ్రాతృత్వ సందేశాన్ని వివరిస్తూ ప్రజల మనో భావాలు, వారి సమస్యలు వింటూ రాహులగాంధీ యాత్రను కొనసాగిస్తున్నారు.
బుధవారంనాడు రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుండి కాంగ్రెస్ పాదయాత్ర పునఃప్రారంభమైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఉదయం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. వీరిరువురూ నడుస్తూనే సీరియస్ గా చర్చలు జరుపుతున్న వీడియో,ఫొటోలను కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, (కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన స్వయం-ప్రకటిత గాడ్ మాన్ నామ్‌దేవ్ దాస్ త్యాగి , నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్, పలువురు నటీనటులు ఉన్నారు. భారత్ జోడో యాత్రకు ప్రజలు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి విశేష స్పందన వస్తోంది. రాహుల్ చేపట్టిన ఈ యాత్రలో ఆయన తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో సాగింది.
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి లో ప్రారంభమైన ఈ యాత్ర మధ్యలో స్వల్ప విరామాలతో దాదాపు వంద రోజులకు చేరుకుంటోంది. కశ్మీర్ లో ఈ యాత్రను ముగిస్తారు. జనవరి 26 నాటికి యాత్ర ముగియవచ్చనే అంచనాలు ఉన్నాయి.