లవర్స్ చాటింగ్ తో 6 గంటలు ఆగిపోయిన ఫ్లైట్

ఫ్లైట్ లో ఉన్న ఓ యువకుడు తన లవర్ తో చేసిన చాటింగ్ విమాన సిబ్బందిని, ప్రయాణీకులను భయాందోళనలకు గురి చేసింది. ఆయన చాట్ లో నువ్వో బాంబర్ వి అన్న టెక్స్ట్ చూసిన తోటి ప్రయాణీకుడు విమాన సిబ్బందికి పిర్యాదు చేయడంతో విమానం ఆరుగంటల ఆలస్యంగా బయలుదేరింది.

Advertisement
Update:2022-08-15 17:54 IST

మంగుళూరు నుంచి ముంబై వెళ్ళడానికి ఓ యువకుడు ఇండిగో విమానం ఎక్కాడు. అతని ప్రేమికురాలు అదే ఎయిర్ పోర్ట్ లో బెంగుళూరు వెళ్ళే ఫ్లైట్ కోసం ఎదురుచూస్తూ ఉంది. ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఆ యువకుడు తన లవ్వర్ తో వాట్సప్ చాటింగ్ మొదలు పెట్టాడు. లోకాన్నిమర్చి పోయి ఇద్దరూ చాట్ చేసుకుంటున్నారు. ఇద్దరూ లవ్వ‌ర్స్, అందులోనూ ప్రైవేట్ చాటింగ్ కాబట్టి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇతన్ని నువ్వో బాంబర్ వి అని టెక్స్ట్ చేసింది. దాన్ని చూసి నవ్వుకుంటూ అతను కూడా దానికి రిప్లై ఇవ్వడంలో లీనమయ్యాడు. అయితే అతని పక్కనే కూర్చున్న మరో ప్రయాణీకుడు ఇతని ఫోన్ లో నడుస్తున్న వాట్సప్ చాట్ పై ఓ కన్నేసి ఉంచాడు. అతనికి నువ్వో బాంబర్ వి అనే టెక్స్ట్ కనపడింది. అంతే...ఒక్క సారి ఆందోళన పడిపోయిన ఆ ప్రయాణీకుడు విమాన సిబ్బందికి పిర్యాదు చేశాడు. అప్పుడే బయలుదేరడానికి సిద్దంగా ఉన్న ఫ్లైట్ ఆగిపోయింది. వెంటనే, విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ డీబోర్డ్‌కు తరలించారు. ఏదైనా విధ్వంసం జరుగుతుందేమో అన్న అనుమానంతో మొత్తం విమానాన్ని తనిఖీ చేశారు.

ఈ మొత్తం వ్యవహారం పూర్తవ్వడానికి ఆరు గంటలు పట్టింది. ఆ తర్వాత సేఫ్ అని భావించిన అధికారులు విమానం ముంబై వెళ్ళడానికి అనుమతించారు. అయితే ఆ చాట్ చేసిన వ్యక్తిని మాత్రం ఫ్లైట్ ఎక్కడానికి అనుమతించలేదు. అతన్ని, అతని లవ్వర్ ని పోలీసులు విచారించడానికి మరింత సమయం పట్టడంతో ఆమె కూడా బెంగుళూరు వెళ్ళలేదు. ఇండిగో ఫ్లైట్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News