సుప్రీం కోర్టులో అగ్ని ప్రమాదం
రెండు కోర్టుల మధ్య వెయిటింగ్ ఏరియాలో ఎగసిపడ్డ మంటలు
Advertisement
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఫైర్ ఎగ్జాస్టర్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అధికారులు ప్రకటించారు.
Advertisement