బహుపరాక్....90 లక్షల క్రెడిట్‌ కార్డుల సమాచారం లీక్!

90 లక్షల క్రెడిట్ కార్డుల మొత్తం సమాచారం డార్క్ వెబ్ సైట్ లో బహిరంగంగా ఉంచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కార్డుల సమాచారం లీకైంది. దీనివల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్ , అనధికారిక లావాదేవీలు జరుగుతాయని పరిశోధకులు చెప్తున్నారు.

Advertisement
Update:2022-10-13 13:31 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుల క్రెడిట్ కార్డులతో సహా 90 లక్షలకు పైగా క్రెడిట్ కార్డుల‌ డేటా లీక్ అయినట్టు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బుధవారం తెలిపారు. లీకైనా సమాచారం మొత్తం భారత్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌, మెక్సికో, టర్కీ, స్పెయిన్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, చైనాలకు చెందిన కార్డుదారులది.

ఈ సమాచారం మొత్తం డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైంది. BidenCash అనే వెబ్ సైట్ లో ఈ కార్డులకు సంబంధించిన CVV నెంబర్లు, కార్డు ఎక్స్పైరీ డేట్లు, బ్యాంకుల పేర్లు, కార్డుహోల్డర్ల‌ పేర్లు, చిరునామాలు, ఇ-మెయిల్ అడ్రస్ లు, ఫోన్‌ నంబర్లు సహా మొత్తం సమాచారం ఉంచారు. .

"స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిసర్వ్ సొల్యూషన్స్ LLC, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కార్డుల సమాచారం లీకైంది. 4,14,000 మాస్టర్‌కార్డ్ లు, సుమారు 5,08,000 డెబిట్ కార్డుల‌ సమాచారం బహిర్గతమైంది." అని భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు.

ఈ కార్డుల సమాచారం లీక్ వల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్ , అనధికారిక లావాదేవీలు జరుగుతాయని దేశాయ్ అన్నారు.

BidenCash వెబ్ సైట్ తన సైట్ కు ట్రాఫిక్ ను పెంచుకోవడం కోసం ఈ క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తమ సైట్ లో పెట్టిందని దేశాయ్ చెప్పారు. దొంగిలించిన కార్డు సమాచారాన్ని విక్రయించేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ BidenCash వెబ్ సైట్ 2022 జూన్‌లోనే తొలిసారి కొన్ని వేల కార్డుల సమాచారాన్ని లీక్‌ చేసింది.

Tags:    
Advertisement

Similar News