రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి!
టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు. ఆయన వెళ్తున్న కారు ఓ డివైడర్ ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
Advertisement
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా పాల్గర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా మరో ఇద్దరు గాయపడ్డారు. అతివేగమే ఈ యాక్సిడెంట్ కి కారణమని భావిస్తున్నారు. రతన్ టాటాతో విభేదించి బయటకి వచ్చిన సైరస్ మిస్త్రీ వయస్సు 54 ఏళ్ళు.. ఆయన మృతిని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ధృవీకరించారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ముంబై సమీపంలోని చరోటీ గ్రామం వద్ద మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement