గుడ్ న్యూస్.. EPF వడ్డీ రేటు పెరిగింది
సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది.
ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఖరారు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు. గత మూడేళ్లలో ఇదే అత్యధికం.
సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
పదేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఇలా..
2013-14 : 8.75 శాతం
2014-15 : 8.75 శాతం
2015-16 : 8.8 శాతం
2016-17 : 8.65 శాతం
2017-18 : 8.55 శాతం
2018-19 : 8.65 శాతం
2019-20 : 8.5 శాతం
2020-21 : 8.5 శాతం
2021-22 : 8.10 శాతం
2022-23 : 8.15 శాతం