ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం - ఢిల్లీ, ముంబయిలో ట్విట్టర్ కార్యాలయాల మూసివేత
ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని ఆయన సూచించారు. భారత్‌లో ఆ సంస్థ మూడో కార్యాలయం బెంగళూరులో ఉంది. ఆ కార్యాలయం మాత్రం కొనసాగుతుంది.
భారతదేశంలోని మూడు ట్విట్టర్ కార్యాలయాల్లో రెండింటిని మూసివేయాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. భారత్‌లో ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో ఇప్పటివరకు ట్విట్టర్‌కు కార్యాలయాలు ఉన్నాయి.
తాజాగా బ్లూమ్ బెర్గ్‌లోని ఒక నివేదిక ప్రకారం ఢిల్లీ, ముంబయిలోని ట్విట్టర్ కార్యాలయాలను మూసివేయాలని ఎలాన్ మస్క్ నిర్ణయించారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని ఆయన సూచించారు. భారత్‌లో ఆ సంస్థ మూడో కార్యాలయం బెంగళూరులో ఉంది.
ఆ కార్యాలయం మాత్రం కొనసాగుతుంది. ట్విట్టర్‌లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎలాన్ మస్క్ భారతదేశంలోని 90 శాతం మంది ట్విట్టర్ సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖర్చులను తగ్గించుకుని ఆర్థికంగా స్థిరపడాలని ట్విట్టర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
యాపిల్ నుంచి గూగుల్ వరకు అనేక పెద్ద సంస్థలు భారతదేశంలో తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నాయి. ట్విట్టర్ ఇప్పటివరకు భారతదేశం నుంచి గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ప్రస్తుతం ఎలాన్ మస్క్ మదిలో భారత్‌కు ఎలాంటి స్థానం ఉందనేది మాత్రం స్పష్టంగా తెలియదు.