బీ అలర్ట్: ఈ వేసవి చాలా కష్టం

ఈ ఏడాది జూన్ నుంచి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంటే వేసవి ప్రతాపం మరింత ఎక్కువగా, ఎక్కువ రోజులు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ద్వారా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాదు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది.

Advertisement
Update:2023-02-05 04:15 IST

భారత్ లో ఏడాదికేడాది వేసవి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉన్నా, ఈసారి మాత్రం వేసవి తాపం తారాస్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు, కరువు పరిస్థితులపై కూడా ముందుగానే కబురందింది. ఇది ముందస్తు హెచ్చరికే కాదు, ఇలాంటి హెచ్చరికలతో ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలు కూడా లేవు, ప్రకృతి ప్రకోపానికి మౌనంగా బలికావాల్సిందేనని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఎల్ నినో..

భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై అసాధారణ వేడి వాతావరణం నెలకొనడమే ఎల్ నినో. అక్కడి వాతావరణ మార్పులు ఆ తర్వాత భూ ప్రాంతంపైకి కూడా విస్తరిస్తాయి. ఎల్ నినో ప్రభావంతో వాతావరణం వేడెక్కడంతోపాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. సహజసిద్ధంగా వచ్చే రుతుపవనాలు కూడా వెనక్కు వెళ్లిపోతాయి. ముఖ్యంగా భారత్ లో రుతుపవనాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపిస్తుందని గతంలో పలుమార్లు రుజువైంది. ఈ ఏడాది మరోసారి అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని అంటున్నారు.

మూడేళ్లుగా లా నినో..

ఎల్ నినో – లా నినో. ఈ రెండూ పరస్పర విరుద్ధ పరిణామాలు. లా నినో ప్రభావం ఉంటే విపరీతమైన వర్షాలు, తుపానులతో వాతావరణం బీభత్సంగా ఉంటుంది. ఎప్పుడూ వానలే. గత మూడేళ్లుగా ఇలాంటి వాతావరణ పరిస్థితులు భారత్ లోని తీర ప్రాంత రాష్ట్రాలకు అనుభవం లోనివే. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా వాతావరణం వేడిగా మారిపోతుందని ఎల్ నినో ప్రభావం మొదలైందనే హెచ్చరికలు వినపడుతున్నాయి.

ఈ ఏడాది జూన్ నుంచి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంటే వేసవి ప్రభావం మరింత ఎక్కువగా, ఎక్కువ రోజులు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ద్వారా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాదు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. కరువు పరిస్థితులు నెలకొంటాయి. కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిపై ఎల్ నినో ప్రభావం ఉంటుంది. అయితే వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే భారత్ పై దీని ప్రభావం మరింత ఎక్కువ.

Tags:    
Advertisement

Similar News