హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్‌ను స్వల్ప భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైంది
Advertisement
హిమాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం నుండి జిల్లాలో భూమి కంపించింది ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు పేర్కొన్నాది. కులు – మండి మధ్య కొండ ప్రాంతంలో.. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, స్వల్ప స్థాయిలోనే భూ ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం వంటివి సంభవించలేదు. మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.
Advertisement