ఢిల్లీలో ఉండటం ఇష్టం లేదు..గడ్కరీ కీలక వ్యాఖ్యలు

తనకు ఢిల్లీలో నివసించడం ఏమాత్రం ఇష్టం ఉండదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2024-12-03 19:16 IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఢిల్లీలో నివసించడం లేదని కాలుష్యం కారణంగా ఇన్‌ఫెక్షన్ బారిన పడతానని ఢిల్లీకి రావాలనిపించడం లేదన్నారు. ఢిల్లీలో కాలుష్యం బాగా ఉందన్నారు.దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యస్థాయి తీవ్రంగా పెరుగుతుండటంతో ఇక్కడకు రావాలంటేనే విసుగు కలుగుతోందని ఓ కార్యక్రమంలో గడ్కరీ తెలిపారు. తాను ఢిల్లీకి వచ్చే ప్రతిసారీ పొల్యూషన్ భయంతో వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తుంటానన్నారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడమే కాలుష్య నివారణకు ఉత్తమ మార్గమన్నారు.

మన దేశం ప్రస్తుతం రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందన్నారు. లక్షల కోట్ల విలువైన దిగుమతుల నేపథ్యంలో ఈ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, జీవావరణంపై పడుతోందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించుకోవచ్చని కేంద్రమంత్రి అన్నారు. మరోవైపు, దిల్లీలో గత నెలలో పొల్యూషన్ విపరీతంగా పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News