ఏపీ నుంచి ఒక్క కోడి తెలంగాణలోకి రావొద్దు
సర్కారు ఆదేశాలు.. 24 చెక్ పోస్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కోడి కూడా తెలంగాణలోకి రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి బ్రాయిలర్, లేయర్ కోళ్ల లోడుతో వస్తున్న ట్రాలీలను అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బర్డ్ ఫ్లూ కంట్రోల్‌లోకి వచ్చే వరకు ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల రవాణాను అనుమతించబోమని పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కోళ్ల ఫాంలలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటి శాంపిళ్లను సేకరించి పూణే ల్యాబ్ కు పంపగా బర్డ్ ఫ్లూగా నిర్దారణ అయ్యింది. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను ఏపీ పశుసంవర్థక శాఖ రెడ్ జోన్‌గా ప్రకటించింది. నిత్యం ఏపీ నుంచి వందలాది వాహనాల్లో కోళ్లకు హైదరాబాద్ కు, తెలంగాణలోని పలు జిల్లాలకు రవాణా చేస్తుంటారు.