'మోడీ మీద నమ్మకం పెట్టుకోకు, నువ్వు పెళ్ళి చేసుకో' అసదుద్దీన్
అహ్మదాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ, తనకు ఎదురైన ఓ సంఘటనను ప్రజలకు వివరించారు. తాను ఓ హోటల్ ఓ యువకుడిని కలిశానని చెప్పాడు. ఆ యువకుడు తనకు చెప్పిన విషయాన్నే ఓవైసీ ప్రజలకు చెప్పాడు.
డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ సారి గుజరాత్ నుంచి 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతున్న AIMIM కూడా తన ప్రచారానికి పదునుపెడుతోంది ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ 14 నియోజకవర్గాల్లో తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ, తనకు ఎదురైన ఓ సంఘటనను ప్రజలకు వివరించారు. తాను ఓ హోటల్ ఓ యువకుడిని కలిశానని చెప్పాడు. ఆ యువకుడు తనకు చెప్పిన విషయాన్నే ఓవైసీ ప్రజలకు చెప్పాడు.
''ఆ యువకుడు ఏం చెప్పాడంటే, నేను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని నన్ను అడిగింది? మా నాన్న పెళ్లికొడుకు కోసం వెతుకుతున్నారు అని చెప్పింది. నేను అప్పుడు నా ప్రియురాలికి ఏమని చెప్పానంటే.. మోదీ ప్రభుత్వాన్ని నమ్మవద్దు, నువ్వు మీనాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పాను'' అని యువకుడు తనతో చెప్పాడని ఓవైసీ అన్నాడు.
"పిఎం మోడీ 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లయిపోయింది. ఒక్క ఉద్యోగమూ లేదు. ఇప్పుడు 2024 వరకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దాన్ని 10 లక్షల ఉద్యోగాలకు తగ్గించాడు. '' అని అసదుద్దీన్ మండిపడ్డారు.
'గుజరాత్ ను అభివృద్ది చేసిన ఘనత బీజేపీదే అయితే.. మోర్బీ బ్రిడ్జి కూలిపోయి 140 మంది మరణించడానికి ఎవరు బాధ్యత వహిస్తారో కూడా వారు మాకు చెప్పాలి. ఆ బ్రిడ్జిని రిపేర్ చేసిన కంపెనీ అసలు యజమానులు పట్టుబడలేదు. ప్రధాని మోదీ, మీరు ధనవంతులనే ఎందుకు ప్రేమిస్తారు? అని ప్రశ్నించారు ఓవైసీ.