డీఎంకే ఓడిపోతుంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుంది

ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళలో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలన్న అమిత్‌ షా

Advertisement
Update:2025-02-26 15:23 IST

జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళ అని పేర్కొన్నారు. అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను ప్రజలు క్షమించాలని కోరారు. అధికార డీఎంకే ప్రభుత్వంపై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. 2026 ఎన్నికల్లో దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఓటమి పాలవుతుందని.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటువుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 బీజేపీకి చారిత్రాత్మక ఏడాదిగా నిలిచిందని షా అన్నారు. అదే ఏడాది నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారని.. చాలా ఏళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కుటుంబ రాజకీయాలను, అవినీతి అంతం చేస్తూ.. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News