ఐఆర్‌సీటీసీ సర్వీసులకు అంతరాయం

నిర్వహణ పనుల కారణంగా ఈ టికెట్‌ సేవలు మరో గంటపాటు అందుబాటులో ఉండవని తెలిపిన సంస్థ

Advertisement
Update:2024-12-09 12:51 IST

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కో ఆపరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) చెందిన ఈ-టికెట్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ వెబ్‌సైట్‌, యాప్‌లు సోమవారం దాదాపు గంటసేపు పనిచేయవని సంస్థ తెలిపింది. నిర్వహణపరమైన పనులు చేపట్టడం వల్లనే అది ఆగిపోయింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. నిర్వహణ పనుల కారణంగా ఈ టికెట్‌ సేవలు మరో గంటపాటు అందుబాటులో ఉండవు. తర్వాత ప్రయత్నించండి. టికెట్‌ రద్దు చేసుకోవడానికి, ఫైల్‌ టీడీఆర్‌ కోసం కస్టమర్‌ కేర్‌ నంబర్‌14646, 0755-6610661,0755-4090600 నంబర్లకు ఫోన్‌ లేదా etickets@irctc.co.inకు మెయిల్‌ చేయండి అని సంస్థ తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News