పిల్లల్రా మీరు.. ఘాటుగా స్పందించిన ఓం రౌత్..

చాలామంది సినిమాలని మొబైల్ లో చూసి ఆనందిస్తుంటారని, అలాంటివారు థియేటర్లకు రారు అని, అలా థియేటర్లకు రాని ప్రేక్షకులు, జనాలతో తమకి ఏమాత్రం లాభం ఉండదని వెటకారం చేశారు దర్శకుడు ఓం రౌత్.

Advertisement
Update:2022-10-05 08:41 IST

కేవలం ఒకే ఒక్క టీజర్ తో దర్శకుడు ఓం రౌత్ అనుకున్నది సాధించారు. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ పై చర్చ మొదలయ్యేలా చేశారు. సాక్షాత్తూ మధ్యప్రదేశ్ హోం మంత్రి ఈ టీజర్ పై స్పందించారంటే ఆదిపురుష్ సినిమాకి అంతకంటే ప్రచారం కావాలా..? సినిమా జయాపజయాల సంగతి పక్కనపెడితే.. కేవలం టీజర్ చూసి సినిమాని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కొంతమంది. ఆ కొంతమందిలో దర్శకుడు ఓం రౌత్ కూడా ఉన్నారు. తన సినిమా టీజర్ పై వచ్చిన ట్రోలింగ్స్ కి ఆయన గట్టిగా సమాధానమిచ్చారు.

మొబైల్ ఫోన్స్ లో చూడ్డానికి కాదు..

తన సినిమా ఓ విజువల్ వండర్ అని చెబుతున్న దర్శకుడు ఓం రౌత్.. ఆదిపురుష్ ని మొబైల్ ప్రేక్షకులకోసం తీయలేదని క్లారిటీ ఇచ్చారు. చాలామంది సినిమాలని మొబైల్ లో చూసి ఆనందిస్తుంటారని, అలాంటివారు థియేటర్లకు రారు అని, అలా థియేటర్లకు రాని ప్రేక్షకులు, జనాలతో తమకి ఏమాత్రం లాభం ఉండదని పరోక్షంగా వెటకారం చేశారు. ఇది మొబైల్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా కాదని, థియేటర్లో ఎక్స్ పీరియన్స్ చేసే వారి కోసం తీసిన సినిమా అని చెప్పుకొచ్చారు. కొంత మంది ఈ టీజర్‌ ను త్రీడీలో థియేటర్లో చూసి ఫిదా అయ్యారని చెప్పుకొచ్చారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారని అన్నారు.

రీషూట్ చేస్తారా..?

ఆదిపురుష్ టీజర్ మరీ కార్టూన్ సినిమాలా ఉందనే కామెంట్లతోపాటు అసలు రామాయణంలోని పాత్రల్ని సరిగా చూపించలేదని, హనుమంతుడి డ్రెస్ కోడ్ బాలేదని, రావణుడి గడ్డం నచ్చలేదని అంటున్నారు కొంతమంది. అయితే వీటిపై ఓం రౌత్ స్పందించలేదు. బీజేపీ నాయకుల హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని అభ్యంతర కరమైన సన్నివేశాల్ని తొలగిస్తారా, ఆదిపురుష్ రీ షూట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

సినిమా కష్టాలు..

ఇలా ఉండాలి అని చెప్పడం వరకు ఓకే, ఇలానే ఉండాలి అని అజమాయిషీ చెలాయించడం మాత్రం నిరంకుశత్వం కిందకే వస్తుంది. ఇప్పుడు భారత్ లో ఈ తరహా వార్నింగ్ లు పెరిగిపోయాయి. తాజాగా ఆదిపురుష్ వివాదంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి స్పందనపై కూడా ఇలాగే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలపై కూడా బీజేపీ పెత్తనం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు.

Tags:    
Advertisement

Similar News