ఝార్ఖండ్‌లో సీట్ల పంపకంపై 'ఇండియా' కూటమిలో విభేదాలు

కాంగ్రెస్‌-జేఎంఎం కలిసి 70 సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటనపై ఆర్జేడీ అసంతృప్తి

Advertisement
Update:2024-10-20 21:35 IST

ఝార్ఖండ్‌ అసెంబ్లీలు దగ్గరపడుతున్నకొద్దీ ఇండియా కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. నిన్న ఆ రాష్ట్రంలోని 81 స్థానాల్లో కాంగ్రెస్‌-జేఎంఎం కలిసి 70 సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటనపై ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మిగిలిన సీట్లను ఇతర భాగస్వామ్యపక్షాలకు ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా స్పందిస్తూ.. తమకు 12 సీట్ల కంటే తక్కువ సీట్లు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ తాము ఒంటరిగా పోటీ చేయాల్సివస్తే ఇండియా కూటమి అవకాశాలను దెబ్బతీయబోమన్నారు.

మనోజ్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. 12-13 సీట్ల కంటే తక్కువైతే మాకు ఆమోద్యయోగం కాదన్నారు. ఆర్జేడీకి 18-20 స్థానాల్లో బలంగా ఉన్నది. మూడు నాలుగు చోట్ల పోటీ చేయాలంటే మేం త్యాగాలకు సిద్ధంగా లేమన్నారు. మా ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమేనని, ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయబోమన్నారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాలని మా పార్టీ నిర్ణయిస్తే 60-62 స్థానాల్లో కూటమి అభ్యర్థులకే మద్దతు ఇస్తామన్నారు.

గత ఎన్నికల్లో ఆర్జేడీ ఏడు సీట్లలో పోటీ చేసి ఒకచోటే గెలిచింది. ఆ పార్టీకి చెందిన సత్యానంద్‌ భొక్త ప్రస్తుతం హేమంత్‌ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. సీట్ల పంపకాలపై ఆయన మాట్లాడుతూ.. గతంలో మేం గెలిచిన సీట్లనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. కుటుంబాల్లోనూ విభేదాలు ఉంటాయి. మాది ఓ పెద్ద కూటమి. కొన్ని సమస్యలు ఉండటం సహజమే అన్నారు. ఈ కూటమిలో మేం భాగస్వామిగా ఉన్నామని.. ఎన్నికల్లో గెలుస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ ఉచ్చులో ఝార్ఖండ్‌ ఇకపై పడరు:కల్పనా సోరెన్‌

బీజేపీ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిట్లు ఝార్ఖండ్‌ ప్రజలు గ్రహించారని జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్‌ పేర్కొన్నారు. ధన్‌బాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆ మాట్లాడుతూ.. బీజేపీ తప్పుడు వాగ్దానాల ఉచ్చులో ఝార్ఖండ్‌ ప్రజలు ఇకపై పడరని అన్నారు. బీజేపీకి ధైర్యం ఉంటే సర్నా మతపరమైన కోడ్‌, రిక్రూట్‌మెంట్‌ పాలసీ, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు వంటి గిరిజన హక్కులకు కట్టుబడి ఉంటామని హామీ ఇస్తుందా? కల్పనా సోరెన్‌ ప్రశ్నించారు. గిరిజనులు, ఓబీసీలు, మహిళల హక్కుల కోసం సీఎం హేమంత్‌ సోరెన్‌ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. బొగ్గు రాయల్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బకాయిల మాటేమిటని బీజేపీని నిలదీశారు. జేఎంఎం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి వాటిని రాబడుతామన్నారు.

Tags:    
Advertisement

Similar News