ఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
ఈ మేరకు ప్రకటన చేసిన చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ రవికుమార్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫొటోను ఈసీ వినియోగించుకోవడానికి ధోనీ అంగీకరించారు. ఇతర వివరాలపై త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతామని, ఓటర్లలో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ధోని కృషి చేస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచడానికి ధోనీ కృషి చేయనున్నారు. ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలకు నవంబర్ 123, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొదటి విడుత కోసం శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.