వంద రోజుల జైలు జీవితం తర్వాత సంజయ్ రౌత్ గొంతు మారింది

మొన్నటి దాకా బీజేపీపై విరుచుకపడ్డ‌ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలునుండి వచ్చాక గొంతు మార్చారు. బీజేపీ నేతలపై ప్రశంసలు కురిపించారు.

Advertisement
Update:2022-11-10 13:55 IST

శివసేన పార్టీ చీలికకు గురై సంక్షోభంలో ఉన్న సమయం లో ఉద్దవ్ ఠాక్రేకు అండగా నిలబడి బీజేపీ పై విరుచుకపడ్డ ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చల్లపడ్డారు. 'పత్రా చాల్' కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. జైల్లో వంద రోజులు గడిపిన ఆయన నిన్ననే బెయిల్ పై విడుదలయ్యారు.

విడుదల తర్వాత రౌత్ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ వందరోజుల జైలు జీవితం ఆయనలో చాలా మార్పును తెచ్చినట్టు అనిపించింది. జైలుకు వెళ్ళకముందు దాకా బీజేపీ పైనా ఆ పార్టీ నాయకులు ఫడ్నవీస్, ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఓంటి కాలిపై లేచే సంజయ్ రౌత్. ఈ రోజు మీడియా సమావేశంలో తనను జైలుకు ప‍ంపిన వారిపైనే ప్రశంసల వర్షం కురిపించారు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న మంచి నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు రౌత్ అన్నారు. గడచిన 100 రోజుల్లో తాను ఎదుర్కొన్న బాధ‌లను తెలియజేయడానికి త్వరలో ఫడ్నవీస్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని ఆయన‌ చెప్పారు.

తనకు ఎవరిపైనా పగ లేదని పేర్కొన్న రౌత్, "కేంద్ర సంస్థలను గానీ, ప్రభుత్వాన్ని గానీ నేను విమర్శించను. ఈ వంద రోజులు నేను చాలా బాధపడ్డాను. వ్యతిరేకించడం కోసమే మేము ఎవరినీ వ్యతిరేకించము. వారు మంచి పని చేసి ఉంటే వారిని అభినందిస్తాము, స్వాగతిస్తాము. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేసింది.'' అన్నారాయన‌

దేశానికి లేదా రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలను స్వాగతించాలి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నాను. నేను త్వరలో ఫడ్నవీస్‌ను కలుస్తాను, "అని రౌత్ అన్నారు రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు అంతం కావాలనే ఫడ్నవీస్ వైఖరిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

రాజ్యసభ ఎంపీ అయిన‌ తన అరెస్టు చట్టవిరుద్ధమని అన్నారు సంజయ్ రౌత్. ''కోర్టు కూడా అదే చెప్పింది. నాపై కుట్ర పన్నిన వారు సంతోషంగా ఉంటే వారిని సంతోషంగా ఉండనివ్వండి. నేను మాత్రం చాలా బాధపడ్డాను.. బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ జరగ‌లేదు'' అని రౌత్ వ్యాఖ్యానించారు.

సంజయ్ రౌత్ లోని ఈ మార్పు దేనికి సంకేతమో త్వ‌రలోనే తేలిపోవచ్చు.

Tags:    
Advertisement

Similar News