రూ.141.84 కోట్లతో రామప్ప, సోమశిల అభివృద్ధి

నిధులు విడుదల చేసిన కేంద్ర పర్యాటక శాఖ

Advertisement
Update:2024-11-29 21:16 IST

రామప్ప, సోమశిల పర్యాటక ప్రాంతాలను రూ.141.84 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మెగా ఐకాన్‌ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణలోని ఈ రెండు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిందని టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌. ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. ఆ నిధులతో చేపట్టబోయే పనుల వివరాలను ఆయన వెల్లడించారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో రూ.73.74 కోట్లతో టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధి చేస్తారు. సోమశిలలో రూ.68.10 కోట్లతో వెల్‌నెస్‌, స్పిర్చువల్ సెంటర్‌ అభివృద్ధి చేయనున్నారు. రామప్ప అభివృద్ధిలో భాగంగా రామప్ప చెరువులోని ఐలాండ్‌ అభివృద్ధి, ఎకో కేఎఫ్‌, థీమ్‌ ప్లాజా, కోటగుల్లు ఆలయ అభివృద్ధి, ఘన్‌పూర్‌ చెరువు అభివృద్ధి, ఇన్‌చెర్లలో పిలిగ్రిమ్స్‌ ప్లాజా, ఎగ్జిబిషన్‌ హాల్‌, హ్యాండిక్రాఫ్ట్స్‌ బజార్‌, ట్రైబల్‌ విలేజ్‌ తదితర నిర్మాణాలు చేపడుతారు. సోమశిల అభివృద్ధిలో భాగంగా మల్లేశ్‌వరం ఐలాండ్‌ అభివృద్ధి, ఈగలపెంట ప్రాంతాల్లో పలు నిర్మాణాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, లగ్జరీ సూట్స్‌ సహా పలు నిర్మాణాలు చేపడుతామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News