నో స్విగ్గీ, జొమాటో ప్లీజ్‌.. జీ20 స‌మ్మిట్‌తో ఢిల్లీలో ఆంక్ష‌లు

స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు, బ్లింకిట్, జెప్టో లాంటి గ్రాస‌రీ డెలివ‌రీ యాప్‌ల సేవ‌లను 3 రోజులు నిలిపివేయాల‌ని ఆదేశించిన ప్ర‌భుత్వం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామ‌ర్స్ సైట్ల‌కు కూడా ఈ రూల్సే ఉంటాయ‌ని చెప్పింది.

Advertisement
Update:2023-09-06 10:44 IST

ఈనెల 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల‌పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీలో స్విగ్గీ, జొమాటో సేవ‌లు నిలిచిపోనున్నాయి. అలాగే బ్లింకిట్‌, జెప్టో వంటి డెలివ‌రీ యాప్‌ల‌ను కూడా ఆ మూడు రోజులు ఢిల్లీలో సేవ‌లు బంద్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 దేశాల సద‌స్సు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త‌కుండా ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. అయితే దేశాధినేతలు త‌ర‌లివ‌స్తున్న నేప‌థ్యంలో భద్ర‌తాప‌ర‌మైన ఇబ్బందులు కూడా రాకుండా ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కూడా

స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు, బ్లింకిట్, జెప్టో లాంటి గ్రాస‌రీ డెలివ‌రీ యాప్‌ల సేవ‌లను 3 రోజులు నిలిపివేయాల‌ని ఆదేశించిన ప్ర‌భుత్వం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామ‌ర్స్ సైట్ల‌కు కూడా ఈ రూల్సే ఉంటాయ‌ని చెప్పింది. ఫుడ్‌, గ్రాస‌రీ డెలివ‌రీ యాప్స్ మాత్ర‌మే కాదు ఎలాంటి ఈ-కామ‌ర్స్ సైట్ల‌కు సంబంధించిన డెలివ‌రీల‌ను నిర్దేశిత ప్రాంతాల్లో నిషేధించామ‌ని ఢిల్లీ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్‌) ఎస్ఎస్ యాద‌వ్ మీడియాతో చెప్పారు.

మందులు, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు ఓకే

అయితే అత్య‌వ‌స‌ర సేవ‌లు అంటే అంబులెన్సు, ఫైర్ స‌ర్వీసులు, క్లినిక‌ల్ ల్యాబ్‌ల‌ను తెరిచి ఉంచుకోవ‌చ్చు. అలాగే మెడిసిన్ డెలివ‌రీల‌కు కూడా అడ్డుచెప్ప‌రు. అత్య‌వ‌స‌ర రోగ‌నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కోసం పేషెంట్ల నుంచి శాంపిల్ క‌లెక్ష‌న్ల‌కు వెళ్లేవారిని కూడా అనుమ‌తిస్తారు.

*

Tags:    
Advertisement

Similar News