'హమ్మయ్య...టాప్-10 కాలుష్య నగరాల్లో ఈ సారి ఢిల్లీ లేదు'
ఈసారి తాజా లిస్ట్ లో ప్రతిసారీ ఉండే ఢిల్లీ లేకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
చాలాకాలం తర్వాత టాప్-10 కాలుష్య నగరాల్లో ఈ సారి ఢిల్లీ లేకపోవడం దేశ రాజధాని ప్రజలకు ఊరటనిచ్చే అంశం. తాజా రిపోర్ట్ ప్రకారం టాప్-10 కాలుష్య నగరాల్లో మొదటి స్థానంలో పాకిస్తాన్ లోని లాహోర్ రెండవ స్థానంలో మన దేశపు ఆర్థిక రాజధాని ముంబై, ఆ తర్వాత వరసగా ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్, తైవాన్ లోని కౌషింగ్, కిర్గిస్తాన్ లోని బిష్కేక్, ఘనా లోని అక్రా, పోలండ్ లోని క్రాకో, ఖతర్ లోని దోహా, కజకిస్తాన్ లోని అస్తానా, చిలీలోని శాంటియాగో లున్నాయి.
కాగా, కాలుష్య తీవ్రత దెబ్బకు వాహనాలకు సరి, బేసి విధానం అమలు చేయడం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయడం, క్రికెట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడడం ఢిల్లీలోనే జరిగాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచ టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ తప్పనిసరిగా ఉంటోంది.
ఈసారి తాజా లిస్ట్ లో ప్రతిసారీ ఉండే ఢిల్లీ లేకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"చాలా కాలం తర్వాత, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ లేదు. ఢిల్లీ వాసుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అయితే ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఢిల్లీ ఉండాలి" అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఢిల్లీ కాలుష్యం ఐదేళ్లలో 28 శాతం తగ్గింది, 2016లో క్యూబిక్ మీటరుకు 135 మైక్రోగ్రాముల నుండి 2022 నాటికి 97 మైక్రోగ్రాములకు తగ్గింది.