ఢిల్లీ బడ్జెట్ కి మోదీ మోకాలడ్డు..

ఢిల్లీ బడ్జెట్, లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా వద్ద నిలిచిపోయి ఉంది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రకటనలపై చేసిన ఖర్చుపై లెక్కలు అడిగారు లెఫ్ట్ నెంట్ గవర్నర్. ఢిల్లీలో ఆయుష్మాన్‌ భారత్ అమలు చేయకపోవడంపై కూడా ప్రశ్నలు సంధించారు.

Advertisement
Update:2023-03-21 11:48 IST

అదేంటి, ఢిల్లీ బడ్జెట్ ని మోదీ ఎలా ఆపగలరు అనుకుంటున్నారా..? ఇది నిజం, ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ పై కొర్రీలు వేసి లెఫ్ట్ నెంట్ గవర్నర్ దగ్గర తొక్కి పెట్టారు. దీంతో ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ నిలిచిపోయింది. బడ్జెట్ కేటాయింపులు ఆలస్యమైతే.. వచ్చే నెల ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందవని అంటున్నారు సీఎం కేజ్రీవాల్..

మీకు దండం పెడతాం.. ప్లీజ్..!

75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక రాష్ట్రస్థాయి బడ్జెట్‌ ను కేంద్రం ఆపడం ఇదే మొదటి సారి అని మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలంటే మీకెందుకంత కోపం అని మోదీని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్‌ ను అడ్డుకోవద్దని ఢిల్లీ ప్రజలు రెండుచేతులు జోడించి మోదీని కోరుతున్నామని అన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖ రాశారు.


ఒకరోజు ముందు ప్రకటన..

వాస్తవానికి ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ కేంద్రం అనుమతివ్వని కారణంగా, బడ్జెట్ కి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కొర్రీలు వేసిన కారణంగా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం లేదని కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణం అని విమర్శలు గుప్పించారు.

లెక్కలు తేల్చాలి..

ఢిల్లీ బడ్జెట్, లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా వద్ద నిలిచిపోయి ఉంది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రకటనలపై చేసిన ఖర్చుపై లెక్కలు అడిగారు లెఫ్ట్ నెంట్ గవర్నర్. ఢిల్లీలో ఆయుష్మాన్‌ భారత్ అమలు చేయకపోవడంపై కూడా ప్రశ్నలు సంధించారు. దేశ రాజధాని నగరంలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆయా అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కోరామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వీటికి సమాధానం ఇవ్వడంతోపాటు, బడ్జెట్‌ ప్రతులను మళ్లీ పంపాలని కోరింది. 4రోజులుగా కేజ్రీవాల్ సమాధానం ఇవ్వలేదని అంటోంది కేంద్ర హోంశాఖ. అయికే కేజ్రీవాల్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే బడ్జెట్ ని తొక్కిపెట్టారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News