ఫలించని ప్రయత్నాలు.. కాలుష్య కోరల్లోనే ఢిల్లీ
ఢిల్లీలో ఈరోజు ఉదయం కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) వెరీ పూర్ కేటగిరీలోనే ఉంది. ఉదయం ఢిల్లీలో AQI 321 కాగా, నొయిడాలో 354గా నమోదైంది. గుర్‌గావ్‌లో 326గా ఉంది.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలకు మూత వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది. ప్రైవేటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టాలంది. ఢిల్లీలోకి డీజిల్ వాహనాలు, బీఎస్-4, బీఎస్-5 వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పేసింది. నిర్మాణాలు, కూల్చివేతల దగ్గర స్మాగ్ గన్స్ ఉండాలని తేల్చి చెప్పింది. ఇంత చేసినా ఢిల్లీలో ఫలితం లేదు. కాలుష్యం కాస్త కూడా తగ్గలేదు.
ఈ రోజు లెక్కలు ఎలా ఉన్నాయంటే..?
Delhi's Air Quality Index (AQI) is in the Very Poor category ఉంది. ఉదయం ఢిల్లీలో AQI 321 కాగా, నొయిడాలో 354గా నమోదైంది. గుర్‌గావ్‌లో 326గా ఉంది. సోమవారం ఢిల్లీలో 326 గా ఉన్న AQI మంగళవారం కేవలం ఐదు పాయింట్లు మాత్రమే తగ్గింది. అంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఫలితం ఏమాత్రం కనిపించడం లేదు.
శాశ్వత పరిష్కారమే మేలు..
దీపావళి తర్వాత ఢిల్లీలో AQI దారుణంగా పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. టపాకాయలపై నిషేధం అమలు చేసినా చాలా మంది నిబంధనలు పాటించలేదు. ఢిల్లీలో దీపావళికి టపాసుల మోతమోగింది. సహజంగానే ఆ తర్వాత కాలుష్యం పెరిగింది. అయితే అది ఇంకా కొనసాగుతుండటమే విశేషం. అప్పటికప్పుడు వాహనాలను నిషేధించడమో, స్కూళ్లు మూసేయడమో, నిర్మాణాలను ఆపేయడమో.. చేయడం వల్ల ఫలితం ఉండదని తేలిపోయింది. వచ్చే ఏడాది నాటికి శాశ్వత ప్రాతిపదికన కాలుష్య నివారణ చర్యలు చేపడతామంటూ ఇటీవల ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీర్ఘకాలిక చర్యలతో ఎలాంటి ఫలితాలు ఉంటాయో వేచి చూడాలి.