ఫెంగల్‌ బీభత్సం.. చెన్నై ఎయిర్‌ పోర్టు మూసివేత

భారీ వర్షాలతో విమానాల రాకపోకలు బంద్‌

Advertisement
Update:2024-11-30 14:27 IST

ఫెంగల్‌ తుఫాను తమిళనాడులో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులకు తోడు భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై ఎయిర్‌ పోర్టును మూసివేశారు. చెన్నై నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎయిర్‌ పోర్టును మూసివేశారు. చెన్నై ఎయిర్‌ పోర్టు రన్‌ వేలపై సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం వచ్చే విమానాలు మినహా, అన్ని సర్వీసులను రద్దు చేశారు. ప్రయాణికులకు కోసం విమానాలను ఇతర నగరాల మీదుగా మళ్లించారు. 

Tags:    
Advertisement

Similar News