బంగారం, వెండి కాదు.. 47 కొండ చిలువ‌లు.. - అక్ర‌మంగా త‌ర‌లిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ప‌ట్టుబ‌డ్డాడు

నిందితుడి బ్యాగులో పలు జాతులకు చెందిన కొండ చిలువ‌ల‌ను అధికారులు గుర్తించారు. రంధ్రాలున్న పెట్టెల్లో నిందితుడు వాటిని తీసుకువచ్చాడు.

Advertisement
Update:2023-07-31 14:56 IST

సాధార‌ణంగా బంగారం లేదా వెండి అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌టాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు చూస్తుంటారు. కానీ త‌మిళ‌నాడులోని తిరుచ్చి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఓ వ్య‌క్తి త‌న‌తో పాటు 47 కొండ చిలువ‌లు, రెండు బ‌ల్లుల‌ను అక్ర‌మంగా తీసుకొస్తుండ‌గా గుర్తించి కంగుతిన్నారు. వెంట‌నే నిందితుడిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

మలేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి తనతో పాటు 47 కొండచిలువలు, రెండు బల్లులను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చాడు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అతడి బ్యాగులో ఏదో ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేయ‌గా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

నిందితుడి బ్యాగులో పలు జాతులకు చెందిన కొండ చిలువ‌ల‌ను అధికారులు గుర్తించారు. రంధ్రాలున్న పెట్టెల్లో నిందితుడు వాటిని తీసుకువచ్చాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వాటిని తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News