వివాదాస్పదమైన ఉచిత మద్యం పంపిణీ.. - బీజేపీ ఎంపీపై ప్రతిపక్షాల మండిపాటు

ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఘాటుగా రియాక్టయ్యారు. భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇదేనని మండిపడ్డారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Update: 2024-07-09 04:10 GMT

బీజేపీ ఎంపీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్న ఆయన మద్దతుదారులు ఈ సందర్భంగా ఉచిత మద్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచితంగా మద్యం పంపిణీ చేస్తున్నారనేసరికి మందుబాబులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఇక ఈ కార్యక్రమానికి ఏకంగా పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం.

కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ నేత కె.సుధాకర్‌ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు స్థానికంగా కృతజ్ఞతా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోనే ఉచితంగా మద్యం పంపిణీ చేపట్టారు. దీనికి జనం ఎగబడటంతో.. పెద్ద క్యూ ఏర్పడింది. విశేషమేమంటే.. ఈ తతంగాన్నంతా పోలీసులే దగ్గరుండి పర్యవేక్షించడం.

ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఘాటుగా రియాక్టయ్యారు. భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇదేనని ఆయన మండిపడ్డారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ముందుగా కాషాయ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం వస్తోందో చూడాలని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News