రాజీవ్ హంత‌కుల‌ విడుద‌ల‌పై కాంగ్రెస్ న్యాయ పోరాటం - మ‌రో మూడు నాలుగు రోజుల్లో సుప్రీంలో రివ్యూ పిటిష‌న్‌

అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఆమోదయోగ్యం కాదని, హంత‌కుల‌ను అలా వ‌దిలిపెట్ట‌డం తప్పు అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ కేసులో శిక్ష‌ప‌డిన ఖైదీలు జైలు నుంచి మాత్ర‌మే విడుదలయ్యారని, నిర్దోషులుగా విడుదల కాలేదని, వారిని ‘హీరోలుగా’ చూడకూడదని పేర్కొంది.

Advertisement
Update:2022-11-21 17:59 IST

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలను సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయ‌నుంది. మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీని త‌మిళ‌నాడులోని శ్రీ‌పెరంబ‌దూరులో ఎల్టీటీఈ తీవ్ర‌వాదులు మాన‌వ‌బాంబుగా మారి హ‌త్య చేశారు. ఈ కేసులో శిక్ష అనుభ‌విస్తున్న నళిని శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేయాలని నవంబర్ 11న సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18న దోషి ఏజీ పేరారివాలన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొన్ని నెలల తర్వాత వీరి విడుద‌ల జ‌రిగింది.

రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషుల విడుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టులో తాజా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. మరో 3 - 4 రోజుల్లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మీడియాకు వెల్ల‌డించారు.

అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఆమోదయోగ్యం కాదని, హంత‌కుల‌ను అలా వ‌దిలిపెట్ట‌డం తప్పు అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ కేసులో శిక్ష‌ప‌డిన ఖైదీలు జైలు నుంచి మాత్ర‌మే విడుదలయ్యారని, నిర్దోషులుగా విడుదల కాలేదని, వారిని 'హీరోలుగా' చూడకూడదని పేర్కొంది.

రాజీవ్ హ‌త్య కేసులో పెరారివాలన్, నళిని శ్రీహరన్, మురుగన్ అలియాస్ శ్రీహరన్, సంతన్, ఆర్‌పి రవిచంద్రన్, రాబర్ట్ పయస్ మరియు ఎస్ జయకుమార్ 1991లో అరెస్టయ్యారు. వారిలో నళిని భర్త శ్రీహరన్ సహా నలుగురు శ్రీలంక జాతీయులు.

మే 21, 1991న, రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో శ్రీలంకలోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)కి చెందిన థాను అనే మహిళా ఆత్మాహుతి బాంబర్‌గా మారింది. తమిళ తిరుగుబాటుదారులను నిరాయుధులను చేసేందుకు 1,000 మంది భారతీయ బలగాలను పంపాలని 1987లో రాజీవ్‌గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీని ఫ‌లితంగానే రాజీవ్ హ‌త్య‌కు ఎల్టీటీఈ ప్ర‌ణాళిక ర‌చించింది.

Tags:    
Advertisement

Similar News