కాంగ్రెస్‌ కు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువయ్యింది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : ఆమ్‌ ఆద్మీ పార్టీ

Advertisement
Update:2024-10-09 17:42 IST

కాంగ్రెస్‌ పార్టీకి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువయ్యిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టు కట్టేది లేదని తేల్చిచెప్పింది. తాము ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని స్పష్టతనిచ్చింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్‌ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ తో ఉన్న కాంగ్రెస్‌ ను, అహంకారంతో ఉన్న బీజేపీతో తలపడే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిందని, మితిమీరిన అతివిశ్వాసంతో బొక్కబోర్లా పడిందని విమర్శించారు. ఢిల్లీలో గడిచిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదని గుర్తు చేశారు. అయినా ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటించి ఆ పార్టీకి మూడు లోక్‌ సభ సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్‌ పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీలకు బాసటగా నిలువలేదని, హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం ఇండియా కూటమిలోని పార్టీలు చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోలేదని తెలిపారు. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని తాము నిర్ణయించామన్నారు.

Tags:    
Advertisement

Similar News