ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ డ్రగ్స్‌ బిజినెస్‌.. కేరాఫ్ గుజరాత్..

గాంధీ-పటేల్ పుట్టిన పుణ్యభూమి గుజరాత్ లో ప్రస్తుతం డ్రగ్స్ విషం వ్యాపిస్తోందని అన్నారు రాహుల్ గాంధీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ డ్రగ్స్ బిజినెస్ కేటగిరీలో గుజరాత్ కి మొదటి స్థానం ఇవ్వాలని చురకలంటించారు.

Advertisement
Update:2022-08-23 13:10 IST

కేంద్రం ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్స్ లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కు స్థానం లేకుండా ఉంటుందా..? అయితే అధికారిక బిజినెస్ కంటే, అనధికారిక బిజినెస్ లో కూడా గుజరాత్ టాప్ ప్లేస్ లో నిలిచిందని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇటీవల కాలంలో గుజరాత్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా పెట్రేగిపోవడం తెలిసిందే. గుజరాత్ పోర్టుల్లోనే వేలకోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడుతున్న ఉదాహరణలు కోకొల్లలు. గత ఐదేళ్ల కాలంలో కేవలం గుజరాత్ ఓడరేవుల్లో 2.5 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల కట్టడిలో విఫలమైన రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

గేట్ వే ఆఫ్ డ్రగ్స్

గుజరాత్ రాష్ట్రంలోని ప్రైవేట్‌ పోర్టులైన ముంద్రా, పిపవావ్‌ పోర్టులు దేశంలో డ్రగ్స్‌కు గేట్‌ వే లుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో చీమ చిటుక్కుమన్నా ఈడీ, సీబీఐ పరిగెత్తుకు వెళ్తాయని, మరి గుజరాత్ లో జరుగుతున్న డ్రగ్స్ దందాపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దృష్టిపెట్టడంలేదని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈడీ, సీబీఐ, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో.. ఈ రెండు పోర్టుల యజమానులను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు ప్రతిపక్ష నేతలు. సింథటిక్‌ డ్రగ్స్‌ తయారుచేస్తున్న నాలుగు ఫ్యాక్టరీలు, హోం మంత్రి కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. గుజరాత్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడుతుండటంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

గాంధీ-పటేల్ పుణ్య భూమిలో విషం..

గాంధీ-పటేల్ పుట్టిన పుణ్యభూమి గుజరాత్ లో ప్రస్తుతం డ్రగ్స్ విషం వ్యాపిస్తోందని అన్నారు రాహుల్ గాంధీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ డ్రగ్స్ బిజినెస్ కేటగిరీలో గుజరాత్ కి మొదటి స్థానం ఇవ్వాలని చురకలంటించారు. సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇలాంటి తప్పుడు పనులు జరుగుతుంటే, ప్రధాని మోదీ మౌనం దేనికి సంకేతం అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. గాంధీ-పటేల్‌ పుణ్యభూమిలో విషాన్ని వ్యాప్తి చేస్తోంది ఎవరని ప్రశ్నించారాయన.

Tags:    
Advertisement

Similar News