రూ.130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువను అంచనా వేయగా, రూ.130 కోట్లకు పైగా ఉంటుందని తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా వాటిని తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టిన రూ.130 కోట్ల విలువైన కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని కచ్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టినట్టు సమాచారం అందుకున్న పోలీసులు దానిపై తనిఖీలు చేపట్టి 13 ప్యాకెట్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువను అంచనా వేయగా, రూ.130 కోట్లకు పైగా ఉంటుందని తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా వాటిని తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ.800 కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అదే ప్రదేశంలో మళ్లీ కొకైన్ ప్యాకెట్లు దొరకడం చూస్తుంటే.. స్మగ్లర్ల ముఠా తన కార్యకలాపాలను నిర్భయంగా కొనసాగిస్తున్నాయని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.