కేసీఆర్‌ని చూసి నేర్చుకోండి.. కర్నాటక ప్రభుత్వంపై రైతన్నల కన్నెర్ర..

విమల్ కుమార్ అనే ఆ రైతు కుటుంబానికి అండగా నిలిచారు. 10లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతే కాదు... తెలంగాణ రైతుబంధు సమితి నేతల్ని కర్నాటకకు పంపించి మరీ వారి కుటుంబానికి సాయం అందించారు.

Advertisement
Update:2022-08-17 08:23 IST

ఎక్కడో కర్నాటక రైతు, జాతీయ రైతు సంఘం తరపున ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోనే ఆయన మరణించారు. మహా అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున అప్పటికి వైద్య ఖర్చులు అయి ఉంటే వాటిని భరిస్తారు, లేదా మృతదేహాన్ని సొంత ఖర్చులతో ఇక్కడినుంచి పంపిస్తారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రైతు కుటుంబాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విమల్ కుమార్ అనే ఆ రైతు కుటుంబానికి అండగా నిలిచారు. 10లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతే కాదు... తెలంగాణ రైతుబంధు సమితి నేతల్ని కర్నాటకకు పంపించి మరీ వారి కుటుంబానికి సాయం అందించారు.

ఇదేదో గొప్ప ఉపకారంగా తెలంగాణ భావించట్లేదు. గతంలోకూడా జవానుల కుటుంబాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గాల్వన్ ఘటనలో మృతిచెందిన వీరసైనికుల కుటుంబాలకు కూడా ఆయన ఆర్థిక సాయం చేశారు. జార్ఖండ్ వెళ్లి మరీ ఆ కుటుంబాలను పరామర్శించి సహాయం చేసి వచ్చారు. రైతు చట్టాల వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా రైతుల కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం చేశారు కేసీఆర్. తాజాగా కర్నాటక రైతు కుటుంబానికి కూడా సాయం అందించి తన పెద్దమనసు చాటుకున్నారు.

కర్నాటక ఏం చేసింది..?

2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ కర్నాటకలో అధికారంలో ఉంది. మరి ఆ పార్టీ ఏం చేసింది. కనీసం చనిపోయిన రైతు కుటుంబాన్నయినా పరామర్శించిందా..? పొరుగు రాష్ట్రం నేతలు ఆర్థిక సాయం చేస్తే, కనీసం కర్నాటక ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఇంకా పరామర్శించలేదు. దీంతో అక్కడి ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై మీకున్న ప్రేమ ఇదేనా అంటూ జాతీయ రైతు సంఘం నాయకులు కర్నాటక ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల వివరాలు చెబుతూ.. తమ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అక్కడి రైతులు.

Tags:    
Advertisement

Similar News